టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఆ ఇద్దరే

ABN , First Publish Date - 2020-12-13T19:29:47+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.

టీపీసీసీ అధ్యక్షుడి రేసులో ఆ ఇద్దరే

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎంపిక ఆ పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం అధిష్టానం కోర్టులో బంతి ఉండడంతో ఏ క్షణంలోనైనా ప్రకటన రావచ్చునని సమాచారం. అయితే అధ్యక్షుని బరిలో చాలా మంది నిలిచినా..చివరికి ఇద్దరి పేర్లు (కోమటి రెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి) వినిపిస్తుండడంతో మరింత టెన్షన్ పెరిగింది.


తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్ నాలుగు రోజులపాటు పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. దాదాపు టీ.కాంగ్రెస్‌కు చెందిన 2 వందలమందితో చర్చలు జరిపినట్లు సమాచారం. మరోవైపు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డిలు సీఎల్పీనేత భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. అన్ని అర్హతలు ఉన్నవారికే టీపీసీసీ అధ్యక్షపదవి ఇవ్వాలని నేతలు కోరారు. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం టీపీసీసీ రేసులో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డిల పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేలా పార్టీని ముందుకు తీసుకువెళ్లే నేతను టీపీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయాలనే ఆలోచనలో హైకమాండ్ ఉంది.

Updated Date - 2020-12-13T19:29:47+05:30 IST