డిగ్రీ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారు
ABN , First Publish Date - 2020-10-08T09:02:54+05:30 IST
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారైంది. హుజూర్‌నగర్‌కు చెందిన

ఒకదానికి బదులు మరొకటి అందజేత
గుర్తించిన అధ్యాపకులు.. న్యాయం చేస్తామని వర్సిటీ హామీ
హుజూర్‌నగర్, అక్టోబరు 7: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారైంది. హుజూర్‌నగర్‌కు చెందిన చైతన్య కళాశాల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షకు 17మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 8 మంది చైతన్య కళాశాల విద్యార్థులున్నారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షకు బదులు కంప్యూటర్ అప్లికేషన్ పేపర్‌ను ఇచ్చారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విద్యార్థులు అధ్యాపకులకు ప్రశ్నపత్రాన్ని చూపించారు. ఈ ఘటనపై విద్యార్థులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. బీఎస్సీ కంప్యూటర్స్‌కు బదులు ఒకేషనల్ కంప్యూటర్స్ అప్లికేషన్ పేపర్ ఇచ్చిన మాట వాస్తవమేనని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అన్నారు. ఎంజీ యూనివర్సిటీ అధికారులకు సమాచార మిచ్చామని, విద్యార్థులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఒకేషనల్, జనరల్ ప్రశ్నపత్రాలు ఒకేచోట ఉండడంతో తప్పిదం జరిగిందన్నారు.