క్వారంటైన్ నుంచి బయటకొచ్చిన వైద్య విద్యార్థిని
ABN , First Publish Date - 2020-03-24T09:27:39+05:30 IST
మారిష్‌సలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఇంటర్న్‌షిప్ కోసం సోమవారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి

మారిష్‌సలో వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఇంటర్న్‌షిప్ కోసం సోమవారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి వచ్చింది. ఇటీవలే మారిషన్ నుంచి వచ్చిన ఆమె చేతిపై క్వారంటైన్ ముద్ర ఉంది. హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సిన సదరు యువతి ఇక్కడికి రావడంతో.. ఆమె చేతిపై ముద్ర చూసిన డీఎంఈ కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయాన్ని గమనించిన ఆ యువతి వెంటనే అక్కడినుంచి ఉడాయించింది.