పీవీపీకి హైకోర్టులో ఊరట
ABN , First Publish Date - 2020-10-24T08:28:25+05:30 IST
పీవీపీకి హైకోర్టులో ఊరట

ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ వీర పొట్లూరి (పీవీపీ)కి హైకోర్టులో ఊరట లభించింది. ఒక విల్లా వ్యవహారంలో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు నుంచి మినహాయిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ఈ నెల(అక్టోబరు) 20న మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తును పోలీసులు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పీవీపీ సహకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.