నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది: పువ్వాడ అజయ్

ABN , First Publish Date - 2020-12-15T15:19:53+05:30 IST

హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా.. తనకు పాజిటివ్ అని తేలిందని.. కాబట్టి తనకు ఫోన్ చేయడానికి కానీ..

నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది: పువ్వాడ అజయ్

హైదరాబాద్: కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా.. తనకు పాజిటివ్ అని తేలిందని.. కాబట్టి తనకు ఫోన్ చేయడానికి కానీ.. కలుసుకోవడానికి కానీ ప్రయత్నించవద్దని ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. ‘‘ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను’’ అని పువ్వాడ అజయ్ వెల్లడించారు. 


Read more