టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలు : గంగుల
ABN , First Publish Date - 2020-03-24T10:36:09+05:30 IST
రైతులకు గ్రామాల వారీగా టోకెన్లు జారీచేసి వరి ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు గ్రామాల వారీగా టోకెన్లు జారీచేసి వరి ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల కోట్లకు ప్రభుత్వం నుంచి బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. సోమవారం హాకాభవన్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సీఎస్ సోమే్‌షకుమార్‌తో కలిసి పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్యాడీ క్లీనర్లు, తేమ యంత్రాలు, గన్నీ బ్యాగులు అన్నీ సమకూరుస్తున్నట్లు తెలిపారు. రైతులకు 60 వేల కొత్త టార్పాలిన్ల కొనుగోలుకు అనుమతిచ్చామన్నారు.