హోం మంత్రిని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి

ABN , First Publish Date - 2020-12-18T01:21:39+05:30 IST

పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ జీందర్ ఎస్ రణదావా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గురువారం నాడు కలిశారు.

హోం మంత్రిని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి

హైదరాబాద్: పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ జీందర్ ఎస్ రణదావా  రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని తన కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. ఆయన జైళ్ల శాఖ అధికారులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల శాఖ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ లోని వివిధ జైళ్ల ను సందర్శించారు. రాష్ట్ర జైళ్ల శాఖ ఖైదీల లో మార్పు తెచ్చేందుకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అధ్యయనం చేసేందుకు పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి ఆధ్వర్యంలో అధికారుల బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నది.


ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఖైదీలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలను కల్పించామని తెలిపారు. వారు పనిచేసేందుకు పరిశ్రమల యూనిట్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలకు జైలు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.


పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి  సుఖజీందర్ ఎస్ రణదావా మాట్లాడుతూ చెర్లపల్లి లోని కారాగారాన్ని, ఓపెన్ ఎయిర్ జైలు ను సందర్శించా మని తెలిపారు. శుక్రవారం నాడు మరికొన్ని జైళ్ల ను పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చార్మినార్ మెమెంటోను పంజాబ్ మంత్రికి హోంమంత్రి బహుకరించారు. తెలంగాణ జైళ్ల శాఖ డీ జీ రాజీవ్ త్రివేది, ఐజి సైదయ్య, పంజాబ్ ప్రిజన్స్ ఏడిజిపి ప్రవీణ్ కె సింహా, ఎస్ పిఎస్ ఒబెరాయ్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T01:21:39+05:30 IST