పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతు
ABN , First Publish Date - 2020-12-20T20:59:52+05:30 IST
ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతయ్యారు.

ఖమ్మం: ఆదివారం సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్ట్‌లో ముగ్గురు గల్లంతయ్యారు. ఈతకు దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కల్లూరు మండలం బత్తులపల్లికి చెందిన జంగ గుణ (24), శీలం చలపతి(25), వేమి రెడ్డి సాయి(18)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్త తెలియడంతో బత్తులపల్లిలో విషాదఛాయలు అలమకున్నాయి. గల్లంతయిన యువకుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుల ఆచూకి కోసం గజఈతగాళ్లను రంగంలోకి దింపారు.