పులిచింతల ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2020-10-03T14:02:03+05:30 IST
పులిచింతల ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో అధికారులు
సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం పెరగడంతో అధికారులు 4 గేట్లు ఎత్తి నీటిని దిగువలకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రస్తుతం 45.410 టీఎంసీలుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 175.89 అడుగులయితే.. ప్రస్తుతం 174.768 అడుగులుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 89,036 క్యూసెక్కులుగా ఉంది.
అలాగే మూసీ ప్రాజెక్ట్ 2 గేట్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. పూర్తి సామర్థ్యం 645 అడుగులు. ప్రస్తుతం 644.20 అడుగులుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు. ప్రస్తుతం 4.25 టీఎంసీలు ఉంది. ఇన్ ఫ్లో 2,075 క్యూసెక్కులు అయితే అవుట్ ఫ్లో 2,870 క్యూసెక్కులుంది.