పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-20T12:51:36+05:30 IST

భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.

పులిచింతల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి

సూర్యాపేట: భారీ వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి  పెరుగుతోంది. దీంతో అధికారులు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 44.69 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 174.309 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 3,17,890 క్యూసెక్కులు, అవుట్ ప్లో 3,22,644 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-20T12:51:36+05:30 IST