విలువలతో కూడిన విద్యను అందించాలి

ABN , First Publish Date - 2020-03-13T11:47:55+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గౌరవ

విలువలతో కూడిన విద్యను అందించాలి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గౌరవ సలహాదారుడు రామచంద్రమూర్తి 


తొర్రూరు, మార్చి 12 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గౌరవ సలహాదారుడు రామచంద్రమూర్తి కోరారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శిక్షణ శిబిరాల ద్వారానే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థుల జీవితాలను బాగుచేయాల్సిన ప్రభుత్వాలు విద్యారంగంపై చిన్న చూపు చూస్తున్నాయన్నారు. విద్య సమాజ మార్పునకు, అభివృద్ధికి దోహద పడుతుందన్నారు.


విద్య ద్వారానే బడుగు బలహీన వర్గా ల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పాఠశాలల్లో అస్థిత్వాన్ని నిలబెట్టుకునేందుకు పల్లెల స్థాయిలో పాలకపక్షాలకు కనువిప్పు కలిగే స్థాయిలో తల్లిదండ్రులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అసమానతమైన నా ణ్యమైన విద్యకోసం కేరళ రాష్ట్రంలో ప్రజలే పర్యవేక్షకులవుతున్నారని తెలుగు రాష్ర్టాల్లో కూడా మార్పు రావాలన్నారు. వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శిక్షణను ఏర్పాటు చేసి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థుల కోసం దాతల సహకారంతో శిక్షణ శిబిరాలను ఏర్పాటుచేసి నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. శిక్షణతో విద్యార్థులకు చదువుతో పాటు విజ్ఞానం పెరుగుతుందన్నారు. ఈ శిబిరాల్లో విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు.


తల్లిదండ్రులకు పాదపూజ

45 రోజులుగా ఫౌండేషన్‌లో శిక్షణ పొందిన 400 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఫౌండేషన్‌కు రాగా తమ తల్లిండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకోగా జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలబడాలని వారు ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య, సీహెచ్‌. ఐలయ్య, గంట రవీందర్‌, తల్లాడ భాస్కర్‌, తొర్రూరు మునిసిపల్‌ చైర్మన్‌ రాంచంద్రయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, సాయి భాస్కర్‌ రెడ్డి, సుశీల్‌సింగ్‌, భగత్‌ సింగ్‌, డాక్టర్‌ రాజు, కౌన్సిల్‌ ఫర్‌ గ్రీన్‌ రెవల్యూషన్‌ కోఆర్డినేటర్‌ లక్ష్మారెడ్డి, డైరెక్టర్‌ మాధవరెడ్డి, విద్యార్థు లు, తల్లిదండ్రులు, ఫౌండేషన్‌ నిర్వాహకులు రవీంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-13T11:47:55+05:30 IST