జోగులాంబ గద్వాలలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ

ABN , First Publish Date - 2020-07-10T22:11:54+05:30 IST

జోగులాంబ గద్వాల : జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది.

జోగులాంబ గద్వాలలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ

జోగులాంబ గద్వాల : జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది. శుక్రవారం నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్‌లు బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్‌కు తలకు తీవ్రగాయమైంది. అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


Updated Date - 2020-07-10T22:11:54+05:30 IST