9న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నిరసన
ABN , First Publish Date - 2020-12-07T09:14:49+05:30 IST
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్, ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 9న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ రియల్‌ఎస్టేట్ అసోసియన్ నిరసన

హైదరాబాద్, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించడంతో పాటు ఎల్‌ఆర్‌ఎస్, ధరణి పోర్టల్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబరు 9న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద తెలంగాణ రియల్‌ఎస్టేట్ అసోసియన్ నిరసన తెలపనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి ఎల్‌ఆర్‌ఎస్, ధరణి పోర్టలే కారణమని ఆ అసోసియన్ పేర్కొంది. తమ నిరసనతోనైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుటుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.