మిమ్మల్ని కాపాడుకుంటూ.. సాయం చేయండి

ABN , First Publish Date - 2020-03-27T09:53:06+05:30 IST

‘‘విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ.. ఇతరులకూ సాయం చేయండి. కాంగ్రెస్‌ సైనికుల్లారా ఆ సమయం ఆసన్నమైంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

మిమ్మల్ని కాపాడుకుంటూ.. సాయం చేయండి

కాంగ్రెస్‌ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపు

‘‘విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ.. ఇతరులకూ సాయం చేయండి. కాంగ్రెస్‌ సైనికుల్లారా ఆ సమయం ఆసన్నమైంది’’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను పేదల కోసం ఖర్చు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురువారం తన నివాసం నుంచి ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, రూ.1500 అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతిస్తోందన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారుల్లో బ్యాంకు అకౌంట్లు లేని వారూ ఉన్నారని.. త్వరితగతిన వారితో అకౌంట్లు తెరిపించాలని కోరారు. కేంద్రం ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-03-27T09:53:06+05:30 IST