మండలి బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్!
ABN , First Publish Date - 2020-09-18T09:46:26+05:30 IST
మండలి బరిలో ప్రొఫెసర్ నాగేశ్వర్!

హైదరాబాద్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీగా సేవలందించిన రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మళ్లీ పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2007-2014 మధ్య ఎమ్మెల్సీగా ఉన్న ఆయన తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మండలికి పోటీ చేస్తారని తెలిసింది. అయితే, తనను అభ్యర్ధిగా ఖరారు చేయాలని ఏ పార్టీని, రాజకీయ నాయకుడిని అభ్యర్ధించలేదని నాగేశ్వర్ తెలిపారు. కానీ, ఇటీవల అసెంబ్లీ, మండలిలో ప్రజల సమస్యలపై చర్చ జరగకపోవడం శోచనీయమన్నారు.