రాష్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-12T04:44:20+05:30 IST
రాష్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం ఇవ్వండి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కోదండరాం
కృష్ణకాలనీ, డిసెంబరు 11: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను గెలిపించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం కల్పించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. భూపాలపల్లిలోని ఉపాఽధ్యాయ సంఘాలతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు. ప్రశ్నించే గొంతును చట్టసభలకు పంపితే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పక్షాన గళమెత్తుతానన్నారు. సింగరేణి ప్రాంతంలోని కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ సంస్థ మోసం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు రత్నం కిరణ్, రెంటాల లింగారెడ్డి, హమీద్, రవిందర్, ఉపాధ్యాయులు సేవానాయక్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.