మాతృభాషలో ప్రారంభ విద్య బలమైన పునాది- ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్

ABN , First Publish Date - 2020-08-20T23:30:47+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యా విధానం, ఒక నూతన శఖానికి నాంది పలుకుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ఎ,న్.ఏ.ఏ.సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ అన్నారు.

మాతృభాషలో ప్రారంభ విద్య బలమైన పునాది- ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధ్యా విధానం, ఒక నూతన శఖానికి నాంది పలుకుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ఎ,న్.ఏ.ఏ.సి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు ప్రొఫెసర్ వై.ఎల్.శ్రీనివాస్ అన్నారు. "NEP-2020-మాతృభాష యొక్క ప్రాముఖ్యత" పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హైదరాబాద్లో నిర్వహించిన వెబ్నార్లో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఆశించినట్లు ఆత్మ నిర్భర్ భారత్ ను సాకారం చేసుకునే దిశగా నూతన విద్యా విధానం ఆవిస్కృతం అయ్యిందని అన్నారు.


దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1948-రాధాకృష్ణన్ కమిటీ, 1952- మురళీధర్ కమిటీ, 1964-కొఠారి కమిషన్, 1990-రామ్మూర్తి కమిషన్, 2009 లో శ్యామ్ పిట్రోడ కమిటీలు దేశ విద్యా వ్యవస్థలో మార్పుల కోసం పనిచేశాయని  1968 లో  లాల్ బహదూర్ శాస్త్రి,  ప్రధాని గా ఉన్నప్పుడూ ఆవిష్కరించిన విధ్యా విధానానికి మార్పులు చేసి, 1986 లో రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్న సమయం లో అమలు చేశారు. 34 సంవత్సరాల తర్వాత ఈ నూతన విద్యా విధానం వచ్చిందని ఆయన అన్నారు. 


మాతృభాష లేదా స్థానిక భాషకు సంబంధించి ప్రారంభ విద్యను అందించే సదుపాయాన్ని కల్పించింది ". మాతృభాషలో విద్యను అందించడం వలన పిల్లల అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తోందని , పిల్లలలో  అవగాహన సామర్థ్యం  పెరిగి  బలమైన పునాదికి దారి తీస్తుందని, పిల్లలలో పరిశోధనాత్మక స్వభావం, సృజనాత్మక వ్యక్తీకరణ పెరుగుతుందని ” ప్రొఫెసర్  శ్రీనివాస్ అన్నారు. ప్ర‌స్తుతం ఉన్న విధానంలో 1 వ త‌ర‌గ‌తి ఆరు సంవ‌త్స‌రాల‌కు ప్రారంభ‌మౌతున్నందువ‌ల్ల  3 నుంచి 6 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌గ‌ల పిల్ల‌లు 10+2  వ్య‌వ‌స్థ‌లోకి రాలేదు. నూత‌న 5+3+3+4 వ్య‌వ‌స్థ‌లో, ప్రారంభ బాల్య సంర‌క్ష‌ణ, విద్య‌‌‌ (ECCE)ని 3 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే చేర్చడంతో మ‌రింత మెరుగైన అభ్య‌స‌న‌, అభివృద్ధి, శ్రేయ‌స్సుకు ఉప‌క‌రిస్తుందని అన్నారు.


NEP-2020 ఒక "గేమ్ ఛేంజర్" అని హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ డీన్ , తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకట రమణ అన్నారు. NEP 2020 లో ఉన్నత విద్య కు సంబధించిన వివరాలను గురించి ఆయన ఈ వెబ్నార్ లో మాట్లాడారు. ఆలోచనలో మాత్రమే కాకుండా, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి మరియు జీవనం మరియు ప్రపంచ శ్రేయస్సుపై బాధ్యతాయుతమైన నిబద్ధతకు మద్దతు ఇచ్చే జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు మరియు వైఖరిని అభివృద్ధి చేయడం ఈ విధానం యొక్క ఉద్దేశించిన లక్ష్యాలని అన్నారు. 



Updated Date - 2020-08-20T23:30:47+05:30 IST