‘జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి’

ABN , First Publish Date - 2020-07-19T17:51:19+05:30 IST

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని..

‘జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి’

హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 2018లో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగిందని, వారు ప్రతీ గ్రామంలో దాదాపు 50 రకాల విధులు నిర్వహిస్తున్నారన్నారు. అరకొర జీతంతో బండెడు చాకిరి చేస్తూ మానసికంగా కృంగిపోతున్నారన్నారు.


ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్ల పని భారాన్ని కూడా వీరి పైనేపడిందని.. అయినా కేవలం రూ. 15 వేల కన్సాలిడేటెడ్ పే మాత్రమే పొందుతున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేస్తున్న శ్రమ దోపిడి అని విమర్శించారు. ఇచ్చే అరకొర జీతం కూడా నాలుగు నెలలకొకసారి ఇవ్వడం భావ్యం కాదన్నారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శుల పని వేళలను లేబర్ చట్టాల ప్రకారం 8 గంటలకు కుదించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, వేతనాలను ప్రభుత్వ ట్రెజరీ నుంచి అందించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-19T17:51:19+05:30 IST