సింగరేణిని ప్రైవేటుపరం చేయొద్దు

ABN , First Publish Date - 2020-08-18T08:05:29+05:30 IST

తెలంగాణలోని సింగరేణి కాలరీ్‌సను ప్రైవేటుపరం చేయొద్దని సీపీఐ, టీజేఎస్‌, టీడీపీ

సింగరేణిని ప్రైవేటుపరం చేయొద్దు

  • ప్రధాని మోదీకి పలు పార్టీల నేతల లేఖ 

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని సింగరేణి కాలరీ్‌సను ప్రైవేటుపరం చేయొద్దని సీపీఐ, టీజేఎస్‌, టీడీపీ, సీపీఐ(ఎంఎల్‌-న్యూడెమోక్రసీ) పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు చాడ వెంకట్‌రెడ్డి,  కోదండరాం, ఎల్‌.రమణ, కె.గోవర్ధన్‌ సోమవారం ప్రధానికి సంయుక్తంగా లేఖ రాశారు. సింగరేణి ప్రైవేటీకరణతో సమాజం, ప్రకృతిపై విధ్వంసపూరిత ప్రభావం ఉంటుందని వారు పేర్కొన్నారు. సుదీర్ఘ ఉద్యమం తరువాత ఏర్పాటైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అత్యధికులు అణగారిన వర్గాల వారేనని తెలిపారు. సింగరేణి కాలరీస్‌ అత్యంత నిరుపేద వర్గాల ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-18T08:05:29+05:30 IST