నల్లరిబ్బన్లు ధరించి ప్రైవేటు టీచర్స్ మౌన దీక్ష
ABN , First Publish Date - 2020-10-04T16:59:12+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది టీచర్ల దయనీయ స్థితికి నిరసనగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ ఎదుట..
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది టీచర్ల దయనీయ స్థితికి నిరసనగా లంగర్‌హౌస్‌లోని బాపు ఘాట్ ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి మౌన దీక్ష చేపట్టారు. స్కూల్స్ యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నా.. తమకు సరిపడ జీతాలు ఇవ్వడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్.. పాఠశాలల మూసివేతవల్ల తమ ఆర్థిక పరిస్థితిని బాగా దెబ్బతీశాయన్నారు. కొన్ని పాఠశాలలు మార్చి నెల జీతం చెల్లించి, ఏప్రిల్, మే నెలల జీతాలు నిలిపివేశాయన్నారు. మరికొన్ని పాఠశాలలు మార్చి నెల జీతంలో సగమే చెల్లించాయన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.