సబితను కలిసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం

ABN , First Publish Date - 2020-07-20T18:32:25+05:30 IST

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నేతలు కలిశారు.

సబితను కలిసిన తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం

హైదరాబాద్ : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నేతలు కలిశారు. సోమవారం ఉదయం మంత్రి కార్యాలయానికి వెళ్లిన ఫోరం నేతలు పలు విషయాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని మంత్రి తెలిపారన్నారు.


ఈ విషయంపై సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి సబిత చెప్పారని అలీ మీడియాకు తెలిపారు.ప్రైవేట్ స్కూల్లో ప్రక్షాళనకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కమిటీలో ప్రైవేట్ టీచర్స్ ఫోరం సభ్యులను కూడా భాగస్వామ్యం చేస్తామన్నారు. రేపు యాజమాన్యాలను పిలిపించి జీతాల గురించి చర్చిస్తామన్నారు. 45 జీవో కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారుఅని షబ్బీర్ అలీ తెలిపారు.

Updated Date - 2020-07-20T18:32:25+05:30 IST