ప్రైవేటు టీచర్ల భిక్షాటన
ABN , First Publish Date - 2020-12-29T04:17:23+05:30 IST
ప్రైవేటు టీచర్ల భిక్షాటన

భూపాలపల్లిటౌన్, డిసెంబరు 28: ప్రైవేటు టీచర్లు జోలె పట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవడం లేదంటూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో భూపాలపల్లిలో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కొవిడ్ కారణంగా ప్రైవేటు పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు టీచర్లు తొమ్మిది నెలలుగా తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అయినా పాలకులకు తమ ఆకలి కేకలు వినిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రైవేటు టీచర్లను ఆదుకోవాలని కోరారు. తమను ఆదుకోకపోతే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బండి తిరుపతి, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్, నాయకులు నదీం, రాజు, మణి, అహ్మద్, జుబేదా తదితరులు పాల్గొన్నారు..