రేపు..ప్రైవేటు ఆస్పత్రులు దేశవ్యాప్త బంద్
ABN , First Publish Date - 2020-12-10T07:19:29+05:30 IST
ప్రైవేటు ఆస్పత్రులు ఈనెల 11న బంద్ పాటించనున్నాయి. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని వైద్య సేవలూ నిలిపివేయనున్నారు

ఆయుర్వేద శస్త్ర చికిత్సలకు
వ్యతిరేకంగా ఐఎంఏ పిలుపు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రులు ఈనెల 11న బంద్ పాటించనున్నాయి. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని వైద్య సేవలూ నిలిపివేయనున్నారు. పలు విభాగాలకు చెందిన ఆయుర్వేద పీజీ వైద్యులకు 58 రకాల శస్త్ర చికిత్సలకు అనుమతినిస్తూ సెంట్రల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విష యం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ ఐఎంఏ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆయుర్వేదాన్ని ఆధునిక వైద్య విధానం తో కలిపితే అది ‘మిక్సోపతి’ అవుతుందని, దానిని తాము అంగీకరించబోమని ఐఎంఏ తెలంగాణ కార్యద ర్శి డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ అన్నారు. అఖిల భార త ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ పన్యల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రతినిధి డాక్టర్ జె.గీతారెడ్డి సీసీఐఎం నోటిఫికేషన్‌ను వ్యతిరేకించారు.