కరోనా ట్రీట్‌మెంట్‌.. ప్రైవేటు ఆసుపత్రుల స్పెషల్ ప్యాకేజీలు

ABN , First Publish Date - 2020-07-23T01:38:31+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో... కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు స్పెషల్ ప్యాకేజీలతో పాటు ఇతరత్రా సర్వీసులను కూడా ప్రకటిస్తున్నాయి. హోం క్వారంటైన్‌లో ఉంటున్నవారి కోసం కోవిడ్ 19 వర్చువల్ హోం కేర్ ఫెసిలిటీస్‌ను కూడా కొన్ని ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

కరోనా ట్రీట్‌మెంట్‌..  ప్రైవేటు ఆసుపత్రుల స్పెషల్ ప్యాకేజీలు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో... కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు స్పెషల్ ప్యాకేజీలతో పాటు ఇతరత్రా సర్వీసులను కూడా ప్రకటిస్తున్నాయి. హోం క్వారంటైన్‌లో ఉంటున్నవారి కోసం వర్చువల్ హోం ఫెసిలిటీస్‌ను కూడా కొన్ని ఆసుపత్రులు అందుబాటులోకి తీసుకొచ్చాయి.


హైదరాబాద్‌లోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఈ స్పెషల్ హోం క్వారంటైన్ కేర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టాయి. అంతేకాకుండా... ఇంటి వద్దే క్వారంటైన్‌ అయ్యే విధంగా సదుపాయాలు లేనివారి కోసం పలు ఆసుపత్రులు... ప్రీమియం హోటల్ క్వారంటైన్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. నాలుగు నక్షత్రాల ప్రీమియం హోటల్‌లో పూర్తిగా శానిటైజ్ చేసిన, వైద్యానికవసరమైన సదుపాయాలతో ఉన్న గదులను చికిత్సకుపయోగిస్తున్నాయి. ఒక్కరు లేదా ఇద్దరు వ్యక్తులు ఉండేలా సింగిల్, డబుల్ బెడ్‌‌రూంలకు 24 గంటల పాటు వైద్య సేవలనందించే పనిలో పడ్డాయి. డైటీషియన్‌ల అధ్వర్యంలో స్పెషల్ ఫుడ్ సర్వీసులను కూడా అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారు. 


కరోనా తీవ్రతను బట్టి ఈ ప్యాకేజీలు బేసిక్, అడ్వాన్స్‌డ్‌, సూపర్ కేటగిరిలలో లభ్యమవుతున్నాయి. చికిత్సలను ఐదు నుంచి ఇరవై రోజుల వరకు అందిస్తుండగా... వీడియో కాల్ ద్వారా డాక్టర్లు, నర్సులు, డైటీషియన్లు... కరోనా రోగిని నిత్యం పర్యవేక్షిస్తుంటారు.  


హైదరాబాద్ లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  గది అద్దెలు అతి భారీగా ఉంటాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, బడా వ్యాపారులు జనవరి 31 వరకు ఆ ఆసుపత్రిలోని గదులను పెద్ద సంఖ్యలో బుక్ చేసుకున్నట్లు సమాచారం. బుక్ చేసుకున్న గదుల్లో ఆయా ప్రముఖుల కుటుంబ సభ్యులు, లేదా వాళ్ళు రిఫర్ చేసిన వ్యక్తులకు చికిత్సనందిస్తారు. ఇతరులను అనుమతించరు. మొత్తంమీద కరోనా నేపధ్యంలో... హైదరాబాద్ సహా దేశంలోని పలు ఇతర నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. 

Updated Date - 2020-07-23T01:38:31+05:30 IST