కరోనా సాకుతో రోగులను చేర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రులు.. మహిళ మృతి

ABN , First Publish Date - 2020-06-20T02:25:23+05:30 IST

కరోనా సాకుతో రోగులను చేర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రులు.. మహిళ మృతి

కరోనా సాకుతో రోగులను చేర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రులు.. మహిళ  మృతి

హైదరాబాద్: కరోనా సాకుతో హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అనారోగ్యంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జలుబు ఆయాసంతో బాధపడుతున్న మహిళలను కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు చేర్చుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలుబు ఆయాసంతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో భర్త అర్ధరాత్రి సమయంలో 10 ఆస్పత్రులను తిరిగారు. చివరకు గాంధీ ఆసుపత్రికి చేరేసరికి భార్య మృతి చెందింది. అత్తాపూర్ లో ఉంటున్న శ్రీకాంత్ భార్యకు జరంతో పాటు ఆయాసం రావడంతో అత్తాపూర్ లో ఉన్న సన్ సైన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కరోనా రోగి అంటూ సన్ షైన్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోలేదని భర్త తెలిపారు. భార్య రోహిత్ ను తీసుకొని అపోలో ఆస్పత్రికి వెళ్లగా అపోలో ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదని భర్త చెప్పారు. అక్కడి నుంచి ఫీవర్ ఆసుపత్రి, విరంచి ఆస్పత్రి, కేర్ ఆస్పత్రి, కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి, ఉస్మానియా ఆస్పత్రి, హోలిస్టిక్ ఆస్పత్రిలో తమ భార్యను చేర్చుకోలేదని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గాంధీ ఆస్పత్రికి వెళ్లేసరికి అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్ మృతి చెందింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ భర్త శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్య రోహిత్ మృతిపై మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2020-06-20T02:25:23+05:30 IST