ప్రైవేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి.. దొంగచాటుగా ప్రయాణికుల తరలింపు

ABN , First Publish Date - 2020-03-23T20:46:15+05:30 IST

కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే.

ప్రైవేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి.. దొంగచాటుగా ప్రయాణికుల తరలింపు

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. ప్రజా రవాణాను బంద్‌ చేయడంతో దీన్నే ప్రైవేట్ అంబులెన్స్‌లు కక్కుర్తితో సొమ్ము చేసుకుంటున్నాయి. దొంగచాటుగా ప్రైవేట్ అంబులెన్సులు ప్రయాణికులను తరలిస్తున్నాయి. పేషెంట్లు ముసుగులో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలిస్తున్నారు.


ఒక్కో ప్రయాణికుడి నుంచి అంబులెన్స్ డ్రైవర్లు వెయ్యి రూపాయిలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేట్ అంబులెన్స్‌లు ఇలా రవాణా సాగిస్తున్నాయి. అయితే.. పలువురి ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇకపై హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. హైవే రోడ్లపై ఇకపై చెకింగ్ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2020-03-23T20:46:15+05:30 IST