ఖైదీలను బెయిలుపై విడుదల చేయాలి: రేవంత్‌

ABN , First Publish Date - 2020-03-24T10:14:06+05:30 IST

కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని

ఖైదీలను బెయిలుపై విడుదల చేయాలి: రేవంత్‌

కరోనా వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారని, కానీ రాష్ట్రంలోని పలు జైళ్లలో వేల మంది ఖైదీలు ఒకేచోట ఉంటున్న విషయాన్ని విస్మరించారన్నారు. ఒక్క చర్లపల్లి జైలులోనే దాదాపు 2 వేల మంది ఖైదీలున్నారని, వీరికి తోడుగా జైలు సిబ్బంది మరో 2 వందల మంది వరకు ఉంటారని పేర్కొన్నారు. 

Read more