నిజామాబాద్: కానిస్టేబుల్‌ను కొట్టి రివాల్వార్‌తో ఖైదీ పరారీ
ABN , First Publish Date - 2020-04-05T16:53:18+05:30 IST
నిజామాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ అనే రిమాండ్ ఖైదీ పరారయ్యాడు...
నిజామాబాద్ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ అనే రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. నిజామాబాద్ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్ దొంగతనం కేసులో రిమాండ్ విధించారు. అయితే అనారోగ్యం కారణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసిన ఆ ఖైదీ శనివారం రాత్రి విధుల్లో ఉన్న ఎస్కార్ట్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు.
అనంతరం ఆ కానిస్టేబుల్ దగ్గరున్న రివాల్వర్ లాక్కొని పరారయ్యాడు. ఈ సమాచారాన్ని కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి చెప్పగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. లాక్‌డౌన్ ఉండటంతో ఆ ఖైదీ ఎక్కడికీ పోలేడని వీలైనంత త్వరగానే ప్రసాద్‌ను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.