పెట్రో ధరల మోత

ABN , First Publish Date - 2020-06-18T09:28:19+05:30 IST

పెట్రో ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. వరుసగా 11వ రోజూ ధరలు పెరిగాయి.

పెట్రో ధరల మోత

  • లీటరు పెట్రోల్‌ రూ.80.65, డీజిల్‌ రూ.74.46


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): పెట్రో ధరలు రోజురోజుకూ భగ్గుమంటున్నాయి. వరుసగా 11వ రోజూ  ధరలు పెరిగాయి. ఫలితంగా వాహనదారులపై భారం పెరుగుతోంది. బుధవారం తెలంగాణలో డీజిల్‌ సగటు ధర రూ.74.46 స్థాయికి చేరింది. వరంగల్‌లో అతి తక్కుగా లీటరు ధర రూ.73.68 ఉండగా, ఆదిలాబాద్‌లో అత్యధికంగా రూ.75.61గా ఉంది. నల్గొండలో రూ.73.96, ఖమ్మంలో రూ.74.05, కరీంనగర్‌లో రూ.74.14, సంగారెడ్డిలో రూ.74.28, మహబూబ్‌నగర్‌లో రూ.74.66, నిజామాబాద్‌లో రూ.75.03గా డీజిల్‌ ధర ఉంది. పెట్రోల్‌ విషయానికి వస్తే.. రాష్ట్రంలో పెట్రోల్‌ ధర రూ.80 స్థాయి దాటింది. ఒక్క వరంగల్‌లో మాత్రమే రూ.80 కన్నా తక్కువ రేటు (రూ.79.82) ఉంది. ఆదిలాబాద్‌లో రికార్డు స్థాయిలో రూ.81.88, నిజామాబాద్‌లో రూ.81.55, మహబూబ్‌నగర్‌లో రూ.80.86, సంగారెడ్డిలో రూ.80.45, కరీంనగర్‌లో రూ.80. 31, ఖమ్మంలో రూ.80.22, నల్గొండలో రూ.80.12గా ఉంది. 

Updated Date - 2020-06-18T09:28:19+05:30 IST