గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేటాయింపులు ఇలా..
ABN , First Publish Date - 2020-03-08T20:05:45+05:30 IST
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి కేటాయింపులు ఇలా..

హైదరాబద్: 2019-20 బడ్జెట్‌తో పోల్చుకుంటే 2020-21 బడ్జెట్ కేటాయింపుల్లో చాలా మార్పులు జరిగాయి. గత బడ్జెట్‌లో అధికంగా నిధులు కేటాయించిన కొన్ని రంగాలకు ఈసారి తగ్గించారు. అలాగే గత బడ్జెట్‌లో తక్కువగా నిధులు కేటాయించిన రంగాలకు ఈసారి పెంచారు. ఇక కొన్ని రంగాలకు నిలకడగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. గత బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టగా, ఈసారి బడ్జెట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. అందులో కొన్ని రంగాలకు కేటాయింపులు ఈ కింది విధంగా ఉన్నాయి. (కేటాయింపులు అన్నీ 2019-20 బడ్జెట్ కేటాయింపులతో 2020-20 బడ్జెట్ కేటాయింపులతో పెరిగిన/తగ్గిన కేటాయింపులు)
పెరిగినవి:
దేవాలయాల అభివృద్ధి (రూ.33.74 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంపు)
ఆర్టీసీ అభివృద్ధి, నిర్వహణ (రూ.630 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు పెంపు)
పంచాయతీరాజ్ అభివృద్ధి (రూ.20,093 కోట్ల నుంచి రూ.23,500 కోట్లకు పెంపు)
రైతు బంధు పథకం (రూ.12,000 కోట్ల నుంచి రూ.14,000 కోట్లకు పెంపు)
వైద్యరంగం (రూ.5,536 కోట్ల నుంచి రూ.6,186 కోట్లకు పెంపు)
పాఠశాల విద్య (రూ.4,954.50 కోట్ల నుంచి రూ.10,421 కోట్లకు పెంపు)
మత్స్యకారుల సంక్షేమం (రూ.602.49 కోట్ల నుంచి రూ.1586 కోట్లకు పెంపు)
తగ్గినవి:
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం (రూ.1450 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గింపు)
ఆసరా పెన్షన్లు (రూ.12,067 కోట్ల నుంచి రూ.11,758 కోట్లకు తగ్గింపు)
మైనారిటీ సంక్షేమం (రూ.2004 కోట్ల నుంచి రూ.1518.06కోట్లకు తగ్గింపు)
సాగునీటి రంగం (రూ.22,500 కోట్ల నుంచి రూ.11,758 కోట్లకు తగ్గింపు)
ఎంబీసీ కార్పొరేషన్ (రూ.1000 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గింపు)
పెద్దగా మార్పులు లేనివి:
ఎస్సీ సంక్షేమం (గత బడ్జెట్‌లో రూ.16,581 కోట్లు కాగా ఈసారి బడ్జెట్‌లో రూ.16534.97 కోట్లు కేటాయించారు)
ఎస్టీ సంక్షేమం (గత బడ్జెట్‌లో రూ.9,827 కోట్లు కేటాయించగా ఈసారి రూ.9771.27 కోట్లు కేటాయించారు)