సబీఐ ఇన్‌స్పెక్టర్ సతీ్‌షకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
ABN , First Publish Date - 2020-12-10T10:03:11+05:30 IST
తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీష్ ప్రభు సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అవార్డును సతీష్ ప్రభుకు బహూకరించారు. సీబీఐతోపాటు

హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్టర్ బి.సతీష్ ప్రభు సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ అవార్డును సతీష్ ప్రభుకు బహూకరించారు. సీబీఐతోపాటు ఆర్‌పీఎ్‌ఫలోనూ అనేక సంచలన కేసుల్ని సమర్థవంతంగా పరిశోధించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో ఈ అత్యున్నత అవార్డు లభించింది. సంచలనం సృష్టించిన అబూ సలేం - మోనికా బేడీ కేసును సతీష్ ప్రభు ఛేదించారు. గౌతమి ఎక్స్‌ప్రెస్ కుట్ర కేసు, అంతర్ రాష్ట్ర గంజాయి కేసుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసి పలు అవార్డులు అందుకున్నారు. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ సాధించిన సతీ్‌షను సీబీఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. పలువురు సీబీఐ అధికారులు ఆయనను సత్కరించారు.