చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం: వినోద్‌

ABN , First Publish Date - 2020-06-21T09:52:12+05:30 IST

తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌ అన్నారు.

చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం: వినోద్‌

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బి. వినోద్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఎంసీఆర్‌హెచ్చార్డీలోని రుద్రమ హాలులో ‘హెరిటేజ్‌ తెలంగాణ’, ‘జనగణ మన తెలంగాణ’ పుస్తకాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కరీంనగర్‌ జిల్లాలోని నంగునూరు, కొత్తపల్లి గ్రామాల్లోని కాకతీయుల కాలంనాటి పురాతన దేవాలయాల పునరుద్ధరణ కోసం కృషి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్చార్డీ డీజీ బీపీ ఆచార్య, కాకతీయ హెరిటేజ్‌ ప్రతినిధులు పాపారావు, ప్రొఫెసర్‌ పాండురంగారావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T09:52:12+05:30 IST