పెద్ద అక్షరాలతో ప్రిస్ర్కిప్షన్‌ రాయాలి: హైకోర్టు

ABN , First Publish Date - 2020-05-29T09:09:39+05:30 IST

పెద్ద అక్షరాలతో ప్రిస్ర్కిప్షన్‌ రాయాలి: హైకోర్టు

పెద్ద అక్షరాలతో ప్రిస్ర్కిప్షన్‌ రాయాలి:  హైకోర్టు

హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): వైద్యులు ప్రిస్ర్కిప్షన్‌లో విధిగా ‘పెద్ద అక్షరాలు (క్యాపిటల్‌ లెటర్స్‌)’ రాయాలని, మందుల జెనరిక్‌ పేర్లు సూచించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పి. రమణారెడ్డి అనే విశ్రాంత టీచరు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. డాక్టర్లు సూచించే మందులకు బ్రాండ్‌ పేర్లకు బదులు వాటిలో వినియోగించే డ్రగ్‌పేరు/జనరిక్‌ పేర్లు సూచించాలన్నారు. ఈ వ్యాజ్యంలో ఐఎంఏను ప్రతివాదిగా ఇంప్లీడ్‌ చేస్తూ.. హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Updated Date - 2020-05-29T09:09:39+05:30 IST