సకాలంలో అందని వైద్యం.. గర్భిణి మృతి

ABN , First Publish Date - 2020-03-13T14:34:10+05:30 IST

వికారాబాద్: సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సకాలంలో అందని వైద్యం.. గర్భిణి మృతి

వికారాబాద్: సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం మొరంగపల్లికి చెందిన మీనా(26) అనే గర్భిణి మృతి చెందింది. మోమిన్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేసిన నర్సులు.. మీనాకు అధిక రక్తస్రావం కావడంతో 108 వాహనంలో సదాశివ పేట్‌కు తరలించారు. మీనా పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సదాశివ పేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు సూచించారు.


వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గర్భిణి మృతి చెందింది. దీంతో గర్భిణి శవంతో మోమిన్‌పేట్ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. విషయం తెలుసుకొని సీఐ నగేష్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆందోళన కారులను పోలీసులు సముదాయిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబీకులు పట్టుబడుతున్నారు.

Updated Date - 2020-03-13T14:34:10+05:30 IST