పురిటినొప్పులతో 3 ఆస్పత్రులకు

ABN , First Publish Date - 2020-05-24T08:33:48+05:30 IST

ఆమె నిండు గర్భిణి.. అప్పటికే పురిటి నొప్పులు మొదలయ్యాయి. అడుగు తీసి అడుగు వేయలేని ఆమె....

పురిటినొప్పులతో 3 ఆస్పత్రులకు

  • అందుబాటులో లేని 108 అంబులెన్స్‌
  • మార్గమధ్యంలో ఆటోలో ప్రసవం

మోమిన్‌పేట, మే 23: ఆమె నిండు గర్భిణి.. అప్పటికే పురిటి నొప్పులు మొదలయ్యాయి. అడుగు తీసి అడుగు వేయలేని ఆమె.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆటోలోనే మూడు ఆస్పత్రులకు తిరగాల్సి వచ్చింది. చివరికి అదే ఆటోలో ప్రసవించింది. వికారాబాద్‌ జిల్లా కల్కోడకు చెందిన శ్రావణి నిండు గర్భిణి. ప్రసవానికి మోమిన్‌పేటలోని తన పుట్టింటికి వచ్చింది. శనివారం ఉదయం నొప్పులు రావడంతో ఆమెను మోమిన్‌పేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుడు అందుబాటులో లేడని, బిడ్డ అడ్డం తిరిగి పరిస్థితి విషమంగా ఉందని.. వెంటనే సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించాలని ఆస్పత్రి సిబ్బంది.. ఆమె భర్త విజయ్‌కుమార్‌కు సూచించారు. 108 వాహనంలో తరలించేందుకు ప్రయత్నించగా టైర్‌ పంక్చర్‌ అయిందని సిబ్బంది తెలిపారు. చేసేదేమీ లేక ఓ ఆటోలో శ్రావణిని సదాశివపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది..సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడికి వెళ్లే క్రమంలో శ్రావణి ఆటోలోనే ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-05-24T08:33:48+05:30 IST