పీఆర్‌సీ అమలు చేయాలి : టీఈఏ

ABN , First Publish Date - 2020-12-11T08:21:43+05:30 IST

రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అమలు చేయడంతోపాటు రెండు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(

పీఆర్‌సీ అమలు చేయాలి : టీఈఏ

హైదరాబాద్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అమలు చేయడంతోపాటు రెండు డీఏలను విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(టీఈఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఈఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ పీఆర్‌సీతోపాటు రెండు డీఏలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు.


కాగా, 2018 జూలై 1వ తేదీ నుంచి పీఆర్‌సీని వర్తింపజేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ డిమాండ్‌ చేసింది. గురువారం జేఏసీ చైర్మన్‌ కె.లక్ష్మయ్య ఆధ్వర్యంలో జేఏసీ కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను కూడా విడుదల చేయాలని, 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్‌ సౌకర్యం వర్తింపజేయాలని కోరారు.


Updated Date - 2020-12-11T08:21:43+05:30 IST