టీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
ABN , First Publish Date - 2020-12-27T12:35:19+05:30 IST
కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ

హైదరాబాద్ : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ రాజేంద్రనగర్ సర్కిల్‌లోని ముస్లింలు, క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైలార్‌దేవుపల్లి డివిజన్ టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం నాయకులు సయ్యద్ అల్లాభక్ష్, షేక్ సనావుల్లా, షేక్ ఆసీఫ్, తదితరులు కాటాదాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కాగా.. నీరసంగా ఉండటం, దగ్గు వస్తుండటంతో మంగళవారం నాడు అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఎమ్మెల్యే కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించుకోగా అక్కడ కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఎమ్మెల్యే శంషాబాద్ మండలం రాళ్లగూడలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో హోం క్వారైంటైన్‌లోకి వెళ్లారు. ఎమ్మెల్యే డ్రైవర్ నిసార్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఓ ప్రకటనలో కోరారు.