కొలువుదీరిన పాలకవర్గం

ABN , First Publish Date - 2020-12-12T05:09:43+05:30 IST

కొలువుదీరిన పాలకవర్గం

కొలువుదీరిన పాలకవర్గం
చైర్‌పర్సన్‌ విజయను సన్మానిస్తున్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్యఘనంగా జనగామ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

జనగామ టౌన్‌, డిసెంబరు 11: జనగామ జిల్లా కేంద్రంలోని స్పెషల్‌ గ్రేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. భారీ స్వాగత ర్యాలీలు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాల మధ్య మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా బాల్దె విజయ, వైస్‌చైర్మన్‌గా ఆగిరెడ్డి, డైరెక్టర్లతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి కె.నాగేశ్వరశర్మ, మార్కెట్‌ స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి జీవన్‌కుమార్‌, మాజీ చైర్‌పర్సన్‌ బండ పద్మ, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సెవెల్లి సంపత్‌, ఎంపీపీ చిట్ల జయశ్రీ, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, నాయకులు బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, బైరగోని యాదగిరి, పెద్దిరాజిరెడ్డి, శ్రవణ్‌, కిషన్‌, సత్యనారాయణ, బాలసిద్దులు, దారం అశోక్‌, గీతాప్రసాద్‌, చిట్ల ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ   ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో రైతాంగానికి నిర్విరామంగా సేవలు అందిస్తానని అన్నారు. జనగామ మార్కెట్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు తెస్తామన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను తుచ తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-12-12T05:09:43+05:30 IST