ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శిగా ప్రకాశ్
ABN , First Publish Date - 2020-05-18T09:44:43+05:30 IST
ఐఎన్‌టీయూసీ జాతీయ కార్యదర్శిగా ప్రకాశ్

బర్కత్‌పుర, మే 17 (ఆంధ్రజ్యోతి): ఐఎన్‌టీయూసీ కొత్త జాతీయ సీనియర్ కార్యదర్శిగా ఆర్.ప్రకాశ్‌గౌడ్ నియమితుడయ్యారు. ఈ మేరకు బర్కత్‌పురలోని తన కార్యాలయంలో ఐఎన్‌టీయూసీ జాతీయాధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కరోనా వైరస్ సాకుతో కార్మిక చట్టాలను యాజమాన్యం వద్ద తాకట్టు పెడుతున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాల రద్దుతో కోట్లాది కార్మికుల రక్షణ, వైద్యం, కనీస వేతనాలు హక్కులు కరువైపోతున్నాయని అన్నారు. కార్మికులు, కూలీలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, యూనియన్ తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆర్.ప్రకాశ్‌రెడ్డి అన్నారు.