ప్రగతిభవన్ వద్ద హల్ చల్ చేసిన యువకుల గుర్తింపు

ABN , First Publish Date - 2020-07-09T03:23:17+05:30 IST

ప్రగతిభవన్ ఎదుట ‘సీఎం కేసీఆర్ ఎక్కడ?’ అనే ప్లకార్డులు ప్రదర్శించిన...

ప్రగతిభవన్ వద్ద హల్ చల్ చేసిన యువకుల గుర్తింపు

హైదరాబాద్: ప్రగతిభవన్ ఎదుట ‘సీఎం కేసీఆర్ ఎక్కడ?’ అనే ప్లకార్డులు ప్రదర్శించిన ఇద్దరు యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. సైదాబాద్‌కు చెందిన కోట్ల సాయిబాబా(లడ్డు పటేల్), బీఎన్‌రెడ్డి‌నగర్‌కు చెందిన సాయికుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. లడ్డు, సాయి కూడా యూత్ కాంగ్రెస్ నాయకులని పోలీసులు తెలిపారు. 


కాగా సీఎం కేసీఆర్ అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద అకస్మాత్తుగా ఇద్దరు యువకులు మెరుపు నిరసనకు దిగారు. ప్రగతిభవన్ ఎగ్జిట్ వైపు బైక్‌పై వెళ్లిన యువకులు.. ‘‘ సీఎం కేసీఆర్ ఎక్కడ?.. ఆయన మా సీఎం. ఆయన ఎక్కడ ఉన్నడో తెలుసుకోవడం మా హక్కు’’ అంటూ ఇంగ్లీష్‌లో రాసిన ప్లేకార్డును ప్రదర్శించి వెళ్లిపోయారు. ఈ ఘటన మెరుపు వేగంతో జరగడం వల్ల ప్రగతిభవన్ వద్ద ఉన్న పోలీసులు  ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 


Updated Date - 2020-07-09T03:23:17+05:30 IST