పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు
ABN , First Publish Date - 2020-12-15T17:58:13+05:30 IST
హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి పీఈటీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు

హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడికి పీఈటీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2018 నుంచి ఫలితాలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ముట్టడికి పిలుపునిచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి, 2018లో పరీక్షలు రాశామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఫలితాలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.