శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలి

ABN , First Publish Date - 2020-11-26T08:19:18+05:30 IST

ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం నిలిచిపోయిన దృష్ట్యా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని

శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి నిలిపివేయాలి

 కృష్ణా బోర్డును కోరిన ఏపీ ప్రభుత్వం

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహం నిలిచిపోయిన దృష్ట్యా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డును ఏపీ కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌సీ నారాయణరెడ్డి బోర్డుకు లేఖను రాశారు.

ఎడమ విద్యుత్తు కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో చెన్నై తాగునీటి అవసరాలతో పాటు, రాయలసీమ నీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. సాగర్‌ ఆయకట్టుకు లేదా, కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని సరఫరా చేయాల్సిన సమయంలో విద్యుదుత్పత్తి చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-11-26T08:19:18+05:30 IST