విద్యుత్‌తో తస్మాత్‌ జాగ్రత్త...

ABN , First Publish Date - 2020-10-24T12:38:26+05:30 IST

కర్ణాటకకు చెందిన సంజీవ్‌కుమార్‌ రహ్మత్‌నగర్‌లో నివాసముంటూ కృష్ణవేణి పాఠశాలలో పనిచేస్తున్నాడు. పాఠశాల సెల్లార్‌లో నిలిచిన వర్షపునీరు పంపించేందుకు మోటారు వేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు...

విద్యుత్‌తో తస్మాత్‌ జాగ్రత్త...

హైదరాబాద్‌ :  కర్ణాటకకు చెందిన సంజీవ్‌కుమార్‌ రహ్మత్‌నగర్‌లో నివాసముంటూ కృష్ణవేణి పాఠశాలలో పనిచేస్తున్నాడు. పాఠశాల సెల్లార్‌లో నిలిచిన వర్షపునీరు పంపించేందుకు మోటారు వేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో  ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని విద్యుత్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ వాడకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు...


ఇళ్లల్లో ఇలా...

వేడినీరున్న ప్రదేశాలలో విద్యుత్‌ తీగలను, పరికరాలను ఉంచవద్దు.

చేతులు తడిగా ఉన్నప్పుడు విద్యుత్‌ పరికరాలు, స్విచ్‌లను తాకవద్దు.

పిల్లలకు అందనంత ఎత్తులో ప్లెగ్గులను ఏర్పాటు చేయాలి.

ఇంటి వైరింగ్‌కు ఎర్తింగ్‌ తప్పనిసరి.

అతికించిన తీగలను అసలే వాడొద్దు.

స్విచాఫ్‌ చేయకుండా ప్లెగ్‌లను బయటకు తీయొద్దు. 

విద్యుత్‌ పరికరాలకు ఉన్న తీగలను పట్టుకొని లాగొద్దు.

పాడైన ప్లెగ్గులను బల్బులను, హోల్డర్లను వినియోగించవద్దు.

ప్ల్లెగ్‌ పిన్నులకు చేతివేళ్లను తాకించద్దు.

నూతనంగా నిర్మిస్తున్న భవనాలను నీటితో తడుపుతున్నప్పుడు తీగలను, విద్యుత్‌ పరికరాలను గమనించాలి.

దుస్తులు ఆరవేసేందుకు ఇనుపతీగలను ఉపయోగించ వద్దు. 

విద్యుత్‌ తీగలకు తగిలిన చెట్లను ఎక్కొద్దు.

పాడైన ఇనుప కమ్మీలను, బోరు కేసింగ్‌ పైపులను తీసుకెళ్తున్నప్పుడు విద్యుత్‌ తీగలు తగలకుండా జాగ్రత్త వహించాలి.


విద్యుత్‌ ఘాతానికి గురైతే...

విద్యుత్‌ ఘాతానికి గురైతే వెంటనే మెయిన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. పొడి కర్రతో గానీ, విద్యుత్‌ ప్రవహించని ఇతర ప్లాస్టిక్‌ వస్తువులతో గానీ సదరు వ్యక్తిని తప్పించాలి. తక్షణమే 108కి సమాచారం అందించాలి.

విద్యుత్‌ తీగలు తెగిపడ్డా, వేలాడుతున్నా సమీపంలోని విద్యుత్‌ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లాలి.


వైరింగ్‌లో జాగ్రత్తలు... 

ఐఎస్‌ఐ ప్రమాణాల ఎలక్ట్రికల్‌ సామగ్రినే ఉపయోగించాలి.

ఏ వస్తువు వాడేందుకు ఎంత విద్యుత్‌ అవసరం పడుతుందో తెలుసుకోవాలి.

ఉదాహరణకు: 10ఏఎంపీఎస్‌ విద్యుత్‌ ఉపయోగించే చోట 20 ఏఎంపీఎస్‌ విద్యుత్‌ భారం పడితే తీగలు కాలిపోయే ప్రమాదం ఉంది.

ఇళ్లలో, ఆఫీసుల్లో అవసరమున్న మేరకు తగిన లోడ్‌ భరించే విద్యుత్‌ తీగలు ఉపయోగించాలి.

ప్రతి ఇంటిలో, చిన్న వాణిజ్య భవనాల్లో న్యూట్రల్‌ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్‌ ఎలకో్ట్రడ్‌ ఏర్పాటు చేసుకోవాలి.

భూమిలోని తేమ, ఉష్ణోగ్రత పై ఎర్తింగ్‌ సిస్టమ్‌ ఆధారపడి ఉంటుంది.

Updated Date - 2020-10-24T12:38:26+05:30 IST