పౌల్ట్రీకి మక్కలు సరఫరా: మంత్రులు

ABN , First Publish Date - 2020-05-08T10:20:49+05:30 IST

పౌల్ట్రీ రంగానికి క్వింటాలు మక్కలను రూ.1,525 రూపాయల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి,

పౌల్ట్రీకి మక్కలు సరఫరా: మంత్రులు

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): పౌల్ట్రీ  రంగానికి క్వింటాలు మక్కలను రూ.1,525 రూపాయల చొప్పున సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. గురువారం మాసాబ్‌ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధి కోసం మంత్రి తలసాని అధ్యక్షతన ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం భేటీలో చర్చించారు. పౌల్ట్రీ రంగానికి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల మక్కలను సరఫరా చేయనున్నట్లు తలసాని వివరించారు. రవాణా ఖర్చులను పౌల్ర్టీ నిర్వాహకులే భరిస్తారని తెలిపారు.  

Updated Date - 2020-05-08T10:20:49+05:30 IST