కోళ్లను పాతిపెట్టిన పౌలీ్ట్ర నిర్వాహకులు

ABN , First Publish Date - 2020-03-18T11:20:02+05:30 IST

వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని చెన్నారావుపేట మండలకేంద్రంలో ఓ పౌలీ్ట్ర ఫామ్‌ నిర్వాహకులు

కోళ్లను పాతిపెట్టిన పౌలీ్ట్ర నిర్వాహకులు

చెన్నారావుపేట, మార్చి 17 : వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని చెన్నారావుపేట  మండలకేంద్రంలో ఓ పౌలీ్ట్ర ఫామ్‌ నిర్వాహకులు మంగళవారం బతికి ఉన్న కోళ్ల ను భారీ గుంత తీసి పాతిపెట్టారు. ఫామ్‌లోని చాలా కోళ్లను గ్రామస్థులకు ఉచితంగా పంపిణీ చేయగా మిగిలిపోయిన వాటిని ఇలా పాతిపెట్టారు. గ్రామానికి చెందిన చాపర్తి రాజు, ఉప్పుల రాజుకుమార్‌ పాత సొసైటీలో ఆవరణలోని కోళ్లఫామ్‌ను అద్దెకు తీసుకొని పౌలీ్ట్ర ఫామ్‌ నిర్వహిస్తూ సుమారు 2 వేల కోడి పిల్లలను పెంచుతున్నారు. ఇటీవల వీటికి వింత వైర్‌స సోకి కోళ్లన్నీ చనిపోతున్నా యి. రోజుకు 15 నుంచి 20 వరకు మృత్యువాత పడడం, కోళ్ల ధరలు మార్కెట్‌ లో అమాంతం పడిపోయి కిలో కోడి రూ.15 మాత్రమే ధర పలుకుతుండడంతో కోళ్ల నిర్వహణ వారికి భారంగా మారింది. దీంతో చేసేదేమి లేక ఫామ్‌లోని కోళ్లను గ్రామస్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. మిగిలిన వాటిని యజమానులు జేసీబీ సాయంతో భారీ గొయ్యి తవ్వి అందులో పూడ్చి పెట్టారు. సుమారు రూ.1లక్ష 50 వేల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. 

Updated Date - 2020-03-18T11:20:02+05:30 IST