ఓటుకు నోటు కేసు 24కు వాయిదా
ABN , First Publish Date - 2020-11-21T08:20:49+05:30 IST
ఓటుకు నోటు కేసులో ఏ2 సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. డిశ్చార్జి పిటిషన్‌పై ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్ తరపు న్యాయవాది

హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఓటుకు నోటు కేసులో ఏ2 సెబాస్టియన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌పై ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. డిశ్చార్జి పిటిషన్‌పై ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్‌పై పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం నవంబరు 24కు వాయిదా వేసింది. రాజకీయ నాయకులపై నమోదైన కేసుల్లో రోజువారి విచారణ జరపాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఈ కేసు విచారణను కొనసాగిస్తోంది.