జూనియర్‌ కళాశాలల ప్రారంభం వాయిదా

ABN , First Publish Date - 2020-06-01T09:41:38+05:30 IST

జూనియర్‌ కళాశాలల ప్రారంభం వాయిదా

జూనియర్‌ కళాశాలల ప్రారంభం వాయిదా

  • 3న జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజీ పరీక్ష 

హైదరాబాద్‌, మే 31(ఆంధ్రజ్యోతి): జూనియర్‌ కళాశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేశామని, నూతన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఒమర్‌ జలీల్‌ తెలిపారు. ఈ నెల 3న ఉదయం 9 నుంచి 12గంటల వరకు ఇంటర్‌ జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజీ-2 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గతంలో ప్రకటించిన కేంద్రాల్లోనే ఇవి జరుగుతాయని, హాల్‌ టికెట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. అనారోగ్య తదితర కారణాలతో ఇప్పుడు హాజరు కాలేనివారిని జులై మూడో వారంలో జరిగే అడ్వాన్స్‌ సప్లిమెంటరీ రాసేందుకు అనుమతిస్తామని.. రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణిస్తామని ఆయన వెల్లడించారు.

Updated Date - 2020-06-01T09:41:38+05:30 IST