టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష వాయిదా
ABN , First Publish Date - 2020-04-28T09:54:50+05:30 IST
టీఎస్‌ఆర్‌జేసీ పరీక్ష వాయిదా

గురుకుల జూనియర్ కాలేజీ(టీఎస్‌ఆర్‌జేసీ)ల్లో ప్రవేశానికి వచ్చే నెల 10ననిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశామని టీఎస్‌ఆర్‌జేసీ కార్యదర్శి వెంకటేశ్వర శర్మ తెలిపారు. దరఖాస్తు తేదీని జూన్ 1కి పొడిగించామన్నారు. సందేహాలుంటే 04024734899, 9490967222నంబర్లను సంప్రదించాలన్నారు.