విద్యార్థుల కుటుంబ సభ్యులు మరణిస్తే పరీక్షలు వాయిదా వేయించండి

ABN , First Publish Date - 2020-03-02T09:53:17+05:30 IST

విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ సమయంలో మానవత్వం చూపి

విద్యార్థుల కుటుంబ సభ్యులు మరణిస్తే పరీక్షలు వాయిదా వేయించండి

విద్యార్థుల కుటుంబ సభ్యులు మరణిస్తే పరీక్షలు వాయిదా వేయించండి

రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలకుమట్టిమనిషి లేఖ

నల్లగొండ, మార్చి 1 : విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఈ సమయంలో మానవత్వం చూపి పరీక్షలు వాయిదా వేయించాలని సామాజిక కార్యకర్త, మట్టిమనిషి వేనేపల్లి పాండురంగారావు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు. కష్టకాలంలోనూ చిన్నారులు ధైర్యం కోల్పోకుండా పరీక్షలు రాస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు తిరిగి పరీక్షలు రాసే అవకాశమివ్వాలని కోరారు.

Updated Date - 2020-03-02T09:53:17+05:30 IST