ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు

ABN , First Publish Date - 2020-09-24T08:48:31+05:30 IST

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వీఆర్‌లో ఉన్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు ఇస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌

ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు

హన్మకొండ ట్రాఫిక్‌ సీఐ బదిలీ 


వరంగల్‌ అర్బన్‌ క్రైం, సెప్టెంబరు 23: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వీఆర్‌లో ఉన్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు ఇస్తూ వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉన్న విజయ్‌కుమార్‌ను హన్మకొండ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు, కె.రామకృష్ణను సీసీఆర్‌బీకి పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే హన్మకొండ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న ఎమ్డీ హన్నన్‌ను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. 

Updated Date - 2020-09-24T08:48:31+05:30 IST